Tuesday, December 17, 2024

సిద్దరామయ్యకు కన్నడ సినీ ప్రముఖుల లేఖ

- Advertisement -
- Advertisement -

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను పరిష్కరించడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని నియమించాలని 100 మందికిపైగా సినీ ప్రముఖులు బుధవారం కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ(ఫైర్) తరఫున కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన లేఖలో కన్నడ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులతోసహా మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు.

ఈ లేఖపై సంతకం చేసిన 153 మంది సినీ ప్రముఖులలో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్,నటి రమ్య కూడా ఉన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్ హేమ కమిటీ కేరళ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక వెలుగుచూసిన అనంతరం అక్కడి పలువురు సినీ ప్రముఖులు అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టు కావడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4న ఫైర్ ఈ లేఖ రాసింది. ఫైర్‌కు ప్రముఖ సినీ దర్శకురాలు, స్రీన్‌రైటర్, పాటల రచయిత్రి కవితా లంకేష్ సారథ్యం వహిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సంస్కరణల కోసం ఆమె చాలాకాలంగా పోరాటం సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News