Sunday, February 2, 2025

పాక్‌లో మహిళా క్రికెటర్‌కు లైంగిక వేదింపులు

- Advertisement -
- Advertisement -

Sexual harassment of a female cricketer in Pakistan

 

కరాచీ: పాకిస్తాన్‌లోని ఓ మహిళా క్రికెటర్‌కు పాక్ జాతీయ జట్టులో చోటు కల్పిస్తానని న మ్మించి, ఆమెను లైంగికంగా వేధించిన మాజీ బౌలర్, జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్‌పై పాక్ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం ఇక్బాల్‌ను విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించింది. ముల్తాన్‌కు చెందిన మహిళా క్రికెటర్ ఫిర్యాదు మేరకు పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెటర్ ఫిర్యాదులో.. ‘ముల్తాన్‌కు చెందిన నేను కొన్నేళ్లుగా జాతీయ మహిళా జట్టులో చో టు కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ క్రమంలో నా కు నదీమ్ పరిచయమమయ్యాడని, నాకు పాక్ మహిళా క్రికెట్ జట్టులో స్థానం కల్పిస్తానని హా మీ ఇచ్చాడని, దీని అడ్డుగా పెట్టుకొని తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని. నదీమ్‌తో పాటు ఆయన స్నేహితులు కూడా ఇదే విధంగా నన్ను వేధించారని ఆమె పేర్కొంది. 1980- 90లలో నదీమ్.. పాక్ మాజీ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌తో కలిసి దేశవాళీ క్రికెట్ ఆడా డు. కానీ, అనివార్య కారణాల వల్ల అతడికి జా తీయ జట్టులో చోటు దక్కలేదు. నదీమ్ 80 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో 258 వికెట్లు పడగొట్టాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News