Friday, December 20, 2024

ఇఫ్లూలో విద్యార్థినికి లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగిన సంఘటన ఇఫ్లూ( ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఇఫ్లూలో ఎంఏ చేస్తున్న విద్యార్థినిపై గత కొంత కాలం నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో బాధిత యువతి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, విద్యార్థిని వేధించిన వారి కోసం గాలిస్తున్నారు. విద్యార్థినిపై రాత్రి సమయంలో లైంగికంగా వేధించడంతో సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News