- Advertisement -
న్యూఢిల్లీ : బీహార్ లోని ముజఫర్‌నగర్‌లో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ , జస్టిస్ కృష్ట మురారితో కూడిన బెంచ్ ఆధ్వర్యంలో జరిగిన విచారణ తర్వాత సుప్రీం కోర్టు ఈ సూచన చేసింది. ముజఫర్ నగర్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో కొంతమంది బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. కోర్టు సూచనలతో ప్రభుత్వం సిబిఐతో విచారణ జరిపించగా, 19 మంది దోషులుగా తేలింది. అయితే ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
- Advertisement -