Monday, December 23, 2024

లైంగిక వేధింపులకు గురిచేసిన అధికారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -
- Advertisement -

బాలల హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : హకీంపేట్ స్పోర్ట్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేసిన అధికారిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం(బిహెచ్‌ఎస్‌ఎస్) డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు ఇటివల కాలంలో ఎక్కువయ్యాయని వీటిని అరికట్టడానికి ప్రతి పాఠశాలలో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు కిష్ఠయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీలు, షీ-టీమ్స్ ఈ మూడు శాఖల సమన్వయంతో రెగ్యులర్ గా బాలికలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కోరారు.

ప్రతి రెండు నెలలకోసారి అన్ని ప్రభుత్వ,  ప్రయివేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్పోర్ట్‌స్కూల్స్, బాలికల ఉన్నత పాఠశాలలు సందర్శించాలని. ఆ స్కూల్స్ లో బాలికల స్థితిగతులపై కేవలం పిల్లతోనే విచారణ జరపాలని వారి అభిప్రాయాలు సేకరించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని. బాలికల భద్రతకు భరోసాను కల్పించాలని కోరారు. బాలికలను లైంగిక వేధింపులకు పాల్పడే వారిని జువైనల్ జస్టిస్ ఆక్ట్ – 2015 ప్రకారం సత్వరం విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని, బాలికలకు భరోసా కల్పించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News