Thursday, January 16, 2025

ఆగస్టు 1న ఎస్‌ఎఫ్‌ఐ ‘ఛలో రాజ్ భవన్’ పిలుపు

- Advertisement -
- Advertisement -
నూతన జాతీయ విధానం కేంద్రం రద్దు చేయాలి

హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 1 వ తేదిన ‘ఛలో రాజ్ భవన్ ‘ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆదివారం ఈసంఘం రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి.నాగరాజు పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లడుతూ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకుని వస్తుందని ప్రభుత్వ విద్యను నష్టం చేసి ప్రైవేట్, కార్పోరేట్ సెక్టార్ లాభం చేసే చర్యలను తీసుకుని వస్తుందని మండి పడ్డారు. దీనిలో భాగంగా ప్రాథమిక విద్యారంగంలో డ్రాపౌట్స్ పెంచేలా మళ్ళీ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ తీసుకుని వచ్చే విధానాన్ని తీసుకువస్తుందని ఆరోపించారు.

పరిశోధన ,ఫెలోషిప్లు లేకుండా విదేశీ యూనివర్శీటీలే ఈ దేశంలోకి స్వేచ్ఛగా వచ్చే విధానాలు ఈ నూతన విద్యావిధానం పేరుతో అమలు చేయాలని చూస్తున్నారు. యూజిసి రద్దు చేసి ప్రైవేట్, ప్రభుత్వ వ్యక్తులు భాగస్వామ్యంతో గవర్నింగ్ బాడీని తెవడం అంటేనే విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమేనని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏజెండా విద్యారంగంలో అమలు చేసే విద్యావిధానం నూతన విద్యావిధానం అందుకే సిలబస్ మార్పులు తెచ్చి ,జాతీయోద్యమ వీరుల చరిత్రలు మార్చడం, డార్విన్ సిద్దాంతం మార్చడం లాంటివి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు విభజన హామీలను అమలు చేయడం లేదు, విభజన హామీలు ఇచ్చిన ఉన్నత విద్యాసంస్థల ను ఇవ్వడం లేదన్నారు. గిరిజన యూనివర్శీటిని కేటాయించడం లేదని, నిధులు లేవు రాష్ట్రంలో ఉన్నత విద్యను బిజెపి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈ రాష్ట్ర యూనివర్శీటీల విద్యార్ధులకు ఇచ్చే ఫెలోషిప్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మోదీ అధికారం చేపట్టిన నాటి వచ్చిన నుండి ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రజనీకాంత్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, జిల్లా ఉపాధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News