Monday, December 23, 2024

గుర్బానీ ప్రసారం కోసం ఎస్‌జిపిసి యూట్యూబ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ : స్వర్ణదేవాలయం నుంచి గుర్బానీ ప్రసారం కోసం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ను ఆదివారం ప్రారంభించింది. స్వర్ణదేవాలయం లోని మంజి సాహిబ్ దివాన్ హాలు నుంచి ఎస్‌జిపిసి చీఫ్ హర్‌జిందర్‌సింగ్ ధామి ఈ ఛానెల్‌ను ప్రారంభించారు. రానున్న మూడు నెలల్లో గుర్బానీ ప్రసారం కోసం శాటిలైట్ ఛానెల్‌ను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఇంతవరకు గుర్బానీని ప్రైవేట్ పిటిసి ఛానెల్ ప్రసారం చేసేది. అయితే ఆదివారం నుంచి ఆ ఛానెల్ ఒప్పందం గడువు ముగిసింది. ఈ ఛానెల్ బాదల్ కుటుంబానికి సంబంధించినది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News