Saturday, December 21, 2024

మ్యాచ్‌మేకింగ్‌ ఫీచర్‌ షాదీ లైవ్‌ను ప్రారంభించిన షాదీ డాట్‌ కామ్‌

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో నెంబర్‌ 1 మ్యాచ్‌ మేకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ షాదీ డాట్‌ కామ్‌, సంప్రదాయ మ్యాచ్‌మేకింగ్‌కు ఓ వినూత్నమైన మలుపునందిస్తూ తమ తాజా ఫీచర్‌ షాదీ లైవ్‌ను విడుదల చేసింది. షాదీ లైవ్‌ అనేది పీరియాడిక్‌ కార్యక్రమం. ఇది ప్రతి 10 రోజులకూ ఓ మారు జరుగుతుంది. ఈ కార్యక్రమంతో అర్హులైన సింగిల్స్‌కు వీడియోకాల్స్‌ ద్వారా 10 సంభావ్య మ్యాచ్‌లతో ఐదేసి నిమిషాల చొప్పున ఓ గంట సంభాషించే అవకాశం కలుగుతుంది.

షాదీ లైవ్‌ గురించి పీపుల్‌ ఇంటరాక్టివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏవీపీ మార్కెటింగ్‌ అదీష్‌ జవేరీ మాట్లాడుతూ ‘‘షాదీ లైవ్‌ అనేది విప్లవాత్మకమైన మ్యాచ్‌మేకింగ్‌ ఫీచర్‌. ఇది విప్లవాత్మక సాంకేతికత, వ్యాపారంపై మనకున్న లోతైన అవగాహనకు నిదర్శనంగా నిలుస్తుంది. మ్యాచెస్‌ నడుమ బహుళ, అర్ధవంతమైన సంభాషణలను సాధ్యం చేస్తుంది. షాదీ లైవ్‌ అనేది ఓ ఫీచర్‌ మాత్రమే కాదు, భవిష్యత్‌ మ్యాచ్‌మేకింగ్‌ ’’అని అన్నారు.

షాదీ లైవ్‌ కోసం మీరు చేయాల్సిందల్లా షాదీ డాట్‌ కామ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, మీ ప్రొఫైల్‌ సృష్టించుకోవడం మరియు సభ్యత్వం పొందడం. దీనిని అనుసరించి వారు రాబోయే షాదీ లైవ్‌ ఈవెంట్‌కు పాస్‌ అందుకుంటారు. ఒకసారి వారు హాజరుకావడానికి తమ సంసిద్ధత తెలిపితే, కార్యక్రమం జరిగే ముందుగా తెలపడం జరుగుతుంది. ఓ గంట జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ 10 మ్యాచ్‌లతో సంభాషించే అవకాశం కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News