Sunday, December 22, 2024

బాలిక కిడ్నాప్… అత్యాచారం… పక్కింటిని తగలబెట్టిన స్థానికులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పక్కింటి వ్యక్తి నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి చిన్నారిపై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని షాబాద్ డైయిరీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గురువారం సాయంత్రం పక్కింట్లో ఉండే పలక్ అనే వ్యక్తి బాలికకు స్వీట్లు కొనిస్తానని ఆశచూపి కిడ్నాప్ చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారి కోసం వెతికారు. తన కూతురు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా బాలిక కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు. పోలీసులు నిందితుడిపై పోస్కో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు నిందితుడి ఇంటిని తగలబెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి స్థానికులను చెదరగొట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News