Monday, December 23, 2024

నడిరోడ్డుపై బాలికను 20 సార్లు కత్తితో పొడిచి… తలపై బండరాయి వేసి….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: స్నేహంగా ఉన్నందుకు నడిరోడ్డు జనాలు చూస్తుండగానే 16 ఏళ్ల బాలికను యువకుడు 20 సార్లు కత్తితో పొడిచి చంపిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీలో సాక్షి(16) అనే అమ్మాయి, సాహిల్ అనే యువకుడు(20) స్నేహితుడిగా ఉన్నాడు. సాహిల్ ఫ్రిజ్‌లు, ఎసిలు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో సాహిల్‌ను సాక్షి దూరం పెట్టింది.

Also Read: ఐపిఎల్ కప్ చెన్నైకే

ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలి బిడ్డ పుట్టిన రోజు ఉండడంతో మార్కెట్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆమె సాహిల్ వెళ్లాడు. సాక్షిపై సాహిల్ కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం పెద్ద బండరాయితో బాలిక తలపై పలుమార్లు బాదాడు. జనం గుంపులు, గుంపులుగా ఉన్నప్పటికి ఎవరూ పట్టించుకోలేదు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహిల్‌ను ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News