హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై హైదరాబాద్ జట్టు గెలిచింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ జట్టు విజయం సాధించడంలో బౌలర్ షాబాజ్ కీలకంగా వ్యవహరించాడు. షాబాజ్ నాలుగు ఓవర్లు వేసి మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, అశ్విన్‌ను షాబాజ్ ఔట్ చేయడంతోనే హైదరాబాద్ జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా షాబాజ్ మీడియాతో మాట్లాడారు. మ్యాచ్‌కు ముందు కెప్టెన్, కోచ్ ఒకటే మాట చెప్పారని, పరిస్థితిని భట్టి జట్టులోకి తీసుకుంటామన్నారని షాబాజ్ తెలిపారు. బ్యాటింగ్ కుప్పుకూలినప్పపుడు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని వారు తనకు వివరించారన్నారు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ మ్యాజిక్ చేసేలా ఉందనిపించిందని, దీంతో స్పిన్‌తోనే ఆ జట్టును కట్టడి చేశామన్నారు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌తో రాణించడం సంతోషంగా ఉందన్నారు. జట్టులో వాతావరణం బాగుందని, ఇప్పుడే సంబరాలు చేసుకోమని, ఫైనల్‌లో గెలిచిన తరువాత సంబరాలు చేసుకుంటామని షాబాజ్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌తో విశ్రాంతి తీసుకుంటున్నామని, ముందు అసలు సమరం ఉందన్నారు.
ఇప్పుడు కాదు ఫైనల్‌లో గెలిచాక సంబరాలు చేసుకుంటాం: షాబాజ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -