Thursday, January 23, 2025

పేదల ఫ్లాట్‌ల నిర్మాణం, కేటాయింపుల్లో అక్రమాలు: షబ్బీర్ అలీ

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ముహమ్మద్ షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పేదల కోసం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ల నిర్మాణం, కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన టేక్రియాల్ కామారెడ్డిలో నిరసన బైఠాయింపు చేపట్టారు. అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీమును బిఆర్‌ఎస్ నాయకులు హైజాక్ చేశారన్నారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు తమ మద్దతుదారులకే లంచం తీసుకుని ఈ ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. నిజానికి రావలసిన వారికి ఆ ఫ్లాట్‌లు రావడంలేదన్నారు. అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని కూడా షబ్బీర్ అలీ ఆరోపించారు. అందుకనే వాటిని కూల్చి తిరిగి కట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. అధిక కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులు అప్పగించారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన అధికారిక గృహం ‘ప్రగతి భవన్’కు రూ. 500 కోట్లు కేటాయించి ఆగమేఘాల మీద పూర్తిచేసుకున్నారని, కానీ అదే పేదల ఇళ్లను తొమ్మిదేళ్లవుతున్న ఇవ్వడానికి తాత్సారం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కనుక వస్తే పేదల సంక్షేమం కోసం పాటుపడగలదన్నారు.

షబ్బీర్ అలీ చేపట్టిన నిరసనకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజలు మద్దతునిచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో, కేటాయింపుల్లో అవినీతి, అక్రమాలను ఆయన ఎండగట్టారు. పాలనపరమైన చర్యల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని ఆయన సూచించారు. వాస్తవానికి అందాల్సిన వారికే అందే పరిస్థితి ఉండాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News