Monday, December 23, 2024

షాదీముబారక్, కళ్యాణలక్ష్మి 6713 మందికి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా చేయడానికి సిఎం కెసిఆర్ విజన్‌తో పని చేస్తున్నారని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల కార్యక్రమం చింతలకుంట ప్రల్లవి గార్డెన్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా ఎంఎల్‌ఎ హాజరై మాట్లాడుతూ గత పాలనకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యా రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని, నియోజకవర్గంలో ఇప్పటికే 6713 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశామన్నారు.

20,326 మం దికి వివిధ రకాల పింఛన్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ మ్మెల్సీలు బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎగ్గే మల్లేశం, హయత్‌నగర్ సర్కిల్ డీసీ మారుతి దివాకర్, హయత్‌నగర్ తహీసీల్దార్ సంధ్యారాణి, సర్కిల్ 10బి జలమండలి జనరల్ మేనేజర్ వినోద్, యుసీడి అధికారి బాలరామ్, బిసి వెల్ఫేర్ సభ్యులు మమత, కృష్ణవేణి, రాకేష్, నర్సింహ్మరావు, మాజీ కార్పోరేటర్లు విఠల్‌రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, భవానీ ప్రవీణ్, సాగర్‌రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, డివిజన్ అధ్యక్షులు జక్కడి మల్లారెడ్డి, చింతల రవికూమార్ గుప్తా, అరవింద్‌రెడ్డి, రాహుల్ గౌడ్, చిరంజీవి, శ్రీశైలం యాదవ్ ,మహేష్ యాదవ్, ముద్ద కళ్యాణ్, రఘువీర్‌రెడ్డి, కెకెఎల్ గౌడ్, జగదీష్‌గౌడ్, కోసనం ధనలక్ష్మీ వెంకట్‌రెడ్డి, రోజా రెడ్డి, లత, ఆదిలక్ష్మీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News