Friday, December 20, 2024

షాద్‌నగర్ బిజెపిలో చతుర్ముఖ పోటీ

- Advertisement -
- Advertisement -

ఎమెల్యే టికెట్‌పై ఆశావహుల ఆపసోపాలు, అధిష్ఠాన వర్గాల మల్లగుల్లాలు
సేవా కార్యక్రమాలతో జనాల్లో పాలమూరు, మరో అవకాశం అంటూ శ్రీవర్థన్‌రెడ్డి
ఈటల మద్దతుతో అందె బాబయ్య, తనయుడు మిథున్‌రెడ్డికోసం తండ్రి జితేందర్‌రెడ్డి యత్నాలు

షాద్‌నగర్ బిజెపిలో ఎమ్మెల్యే టికెట్ రేసులో చర్ముఖ పోటీ నెలకొంది. పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుగా వ్య వహరించి కార్యకర్తలో నయా జోష్
తీసుకొచ్చారు. అయితే షాద్‌నగర్ ని యోజకవర్గంలో ఓ మోస్తారుగా ఉన్న బిజెపి సంజయ్ దూకుడు, ప్రధా నమంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాల చరిష్మాతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు
షాద్‌నగర్ నియోజకవర్గంలోనూ కొంత బలపడిందని చెప్పవచ్చు.
ఇతర పార్టీల నుంచి నేతలను బిజెపిలో చేరేంత ఊపు రావడంతో
షాద్‌నగర్ బిజెపి అగ్ర నేతలు వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్ అసెంబ్లీ బరిలో
నిలిచేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అదిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుత పార్టీ ఇంచార్జీగా ఉన్న శ్రీవర్థన్‌రెడ్డి, ఇటీవలే రాష్ట్ర కార్యవర్గ సభుడ్యిగా ఎన్నికైన అందె బాబయ్య, సామాజిక సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్న బిజెపి నేత పాలమూరు విష్ణువర్థన్‌రెడ్డి, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి తన యుడు మిధున్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు టికెట్ పోరులో నిలు స్తున్నారు. నలుగురు బడా నేతలు మాత్రం ఎవరికి వారు తమ తమ మార్కును చాటేందుకు అపసోపాలు
పడుతున్నారు.

మనతెలంగాణ/ఫరూఖ్‌నగర్ : షాద్‌నగర్ భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రేసులో చర్ముఖ పోటీ నెలకొంది. పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుగా వ్యవహరించి కార్యకర్తలో నయా జోష్ తీసుకొచ్చారు. అయితే షాద్‌నగర్ నియోజకవర్గంలో ఓ మోస్తారుగా ఉన్న బిజెపి సంజయ్ దూకుడు, ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాల చరిష్మాతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు షాద్‌నగర్ నియోజకవర్గంలోనూ కొంత బలపడిందని చెప్పవచ్చు. ఇతర పార్టీల నుండి నేతలను బిజెపి లో చేరేంత ఊపు రావడంతో షాద్‌నగర్ బిజెపి అగ్ర నేతలు వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అదిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్థుత పార్టీ ఇంచార్జీగా ఉన్న శ్రీవర్థన్‌రెడ్డి, ఇటీవలే రాష్ట్ర కార్యవర్గ సబ్యులుగా ఎన్నికైన అందె బాబయ్య, సామాజిక సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్న బిజెపి నేత పాలమూరు విష్ణువర్థన్‌రెడ్డి, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి తనయుడు మిధున్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు టికెట్ పోరులో నిలుస్తున్నారు. నలుగురు బడా నేతలు మాత్రం ఎవరికి వారు తమ తమ మార్కును చాటేందుకు అపసోపాలు పడుతున్నారు.

గత 20ఏండ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీవర్థన్‌రెడ్డి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్టీ నెల్లి శ్రీవర్థన్‌రెడ్డి గత 20ఏండ్లుగా భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ నిత్యం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. రెండు పర్యాయాలు పార్ట అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఒక్క మారు ఎమ్మెల్సీగా పోటీలో నిలిచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత నాలుగేండ్లలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను రాష్ట్ర కమిటీ పెద్దల సమాలోచనలతో పార్టీలోకి ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేశారు. గతంలో కంటే ప్రస్థుతం పార్టీ కొంత బలోపేతంగా ఉండంతో మరో మారు అసెంబ్లీ బరిలో నిలచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎండ్ల తరబడి పార్టీలో క్రియాశీలంగా ఉంటూ పార్టీని కార్యకర్తలను కాపాడుకుంటూ ఎన్నో ఒడిదుడుకులకు గురయ్యాను అని మరొక్కమారు అవకాశం కల్పించాలని అధిష్టానం పెద్దలను కోరుతున్నారు. గతంలో పోటీ లేకుండా అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీవర్థన్‌రెడ్డి ప్రస్థుతం నేతల్లో తీవ్ర పోటీ నెలకొనడంతో టికెట్ కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

ప్లీజ్ ఒక్క అవకాశం అంటున్న అందె బాబయ్య

బిఆర్‌ఎస్ నుండి బయటకు వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాటలో నడిచి బిజెపి తీర్థం పుచ్చుకున్న షాద్‌నగర్ నియోజకవర్గ సీనియర్ నేత అందె బాబయ్య ప్లీజ్ ఒక్క అవకాశం అంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటేవలే జన్మదిన వేడుకల సంధర్భంగా తన బలం చాటేండుకు ప్రయత్నించి సఫలమయ్యారు. ముదిరాజ్ వర్గంలో అగ్రనేతగా ఈటెల రాజేందర్ మద్దతుదారునిగా సినియర్ నేతగా తనకు అధిష్టానం తప్పక అవకాశం కల్పిస్తుందని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఖర్చును సైతం సమకూర్చుకున్నానని బహిరంగానే చెప్పుకోస్తున్నారు. బిఆర్‌ఎస్‌లో ఆశించి భంగ పడ్డాను బిజెపి లో అయిన టికెట్ దక్కుతుందో లేదో అనే బెంగ గుబులును బయటకు కనిపించకుండా తనకే అనే ధీమాను అనుచర గనం వద్ద వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి ప్రయత్నాలతో మిధున్‌రెడ్డికి టికెట్ దక్కేనా

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత , మహాబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తన కొడుకు మిధున్‌రెడ్డికి షాద్‌నగర్ అసెంబ్లీ సీటు ఇప్పించే ప్రయత్నాలు సఫలమయ్యేనా అనే రాజకీయ వార్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కొడుకు సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలపైనే ఆధారపడ్డ మిధున్‌రెడ్డి టిక్‌ట్ రేసులో తనే ముందు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతర సమస్యను నివారించేందుకు పట్టణంలో సొంతింటిని నిర్మించుకుంటూ స్థానికునిగా చలామని అవుతున్నారు. రాజకీయంగా తండ్రి వారసునిగా నియోజవర్గ అసెంబ్లీ బరిలో పార్టీ నుంచి అవకాశం కోసం ఉత్సాహాంగా ఎదురుచూస్తున్న మిధున్‌రెడ్ది ఇటీవల పలు మార్లు రాష్ట్ర కమిటీ నేతలను ప్రసన్నం చేసుకునే పలు కార్యక్రమాలు నిర్వహించి మెప్పు పొందారు. మరి యువ నేత అశలు ఫలించునో లేదో వేచి చూడాల్సిందే.

సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పాలమూరు

సామాజిక సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషినని అధిష్టానం పెద్దలకు చాటేందుకు కోట్ల రూపాలయల ఖర్చుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు మరో సీనియర్ నేత పాలమూరు విష్ణువర్థన్‌రెడ్డి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అనుచరులుగా చలామని అవుతూ సేవా కార్యక్రమాలతో పార్టీ గ్రామాల్లో తన దైన ముద్ర వేసుకొచ్చారు. కరోనా సహాయంతో మొదలైన సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు. వేసవిలో అంబలి కేంద్రాలు, యువతకు జాబ్ మేళా, వైద్య శిభిరాలు, అకాల వర్షాల కారణంగా ఇండ్లు దెబ్బతిన్న బాధితులకు ఆర్థిక సహాయం, డ్రైవింగ్ లైసెన్స్‌లు, హెల్మెంట్ల పంపిణీ, రాఖీ రక్షా కార్యక్రంతో ప్రతి మహిళకి చీరల పంపిణీ కార్యక్రమాలతో జన నేతగా పార్టీ పెద్దలను ఆకర్షిస్తున్నారు. ఇటు సేవా కర్యాక్రమాలతో పాటు టికెట్ కోసం అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జోరుగానే సాగిస్తున్నారు. పార్టీ తన సేవా కార్యక్రమాలను గుర్తించి టికెట్ తనకే వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సైతం విష్ణు వర్థన్‌రెడ్డి సేవా కార్యక్రమాలను కొనియాడుతున్నారు.

అధిష్టానం ఎవరికి మొగ్గు చూపునో మరి

రానున్న అసెంబ్లీ బరిలో నిలిచేందుకు షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలువురు నేతలు కుతూహలంగా ఉన్నారు. ప్రధానంగా నలుగురు నేతలు అధిష్టానం మద్దతు కోసం ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో అని స్థానిక బిజెపి నేతలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది ఆశావాహులు ఇప్పటికే తమకు టికెట్ ఇవ్వాలంటూ అధిష్టాన వర్గానికి ధరఖాస్తులు చేసుకుంటున్నారు. షాద్‌నగర్ బిజెపి టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి యుండాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News