టాపర్‌గా షెఫాలీ వర్మ
12వ తరగతిలో 80+ మార్కులతో పాసైన మహిళా బ్యాటర్
ముంబై : మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తూ టీమిండియాకు శుభారంభాన్ని అందిస్తూ జట్టు గెలుపు కీలక పాత్ర వహిస్తూ టాప్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ చదువులోనూ అద్భుతంగా మార్కులు సాధిస్తూ టాపర్‌గా నిలిచింది. సిబిఎస్‌ఇ బోర్డు నిర్వహించి పరీక్షల్లో 80+ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో.. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ, నాకు ఇష్టమైన సబెక్టు మాత్రం క్రికెట్.’ అంటూ ఆ ఫొటో కింద రాసుకొచ్చింది షెఫాలీ.
కాగా, ఇప్ప టి వరకూ భారత జట్టు తరుఫున మొత్తం 79 మ్యాచ్‌లు ఆడింది. 2016 పరుగులు చేసింది. షెఫాలీ నాయకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో ఐసిసి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌నూ భారత్ సొంతం చేసుకుంది. తద్వారా టీమిండియాకు తొలి ఐసిసి అం డర్-19 ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కిం ది. ఇటీవల నిర్వహించిన మహిళల ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షెఫాలీ పరుగుల వరద పారించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర వహించి, మొత్తం 9 మ్యాచ్ ల్లో 185.29 సగటుతో 252 పరుగులు చేసింది.