Sunday, December 22, 2024

మీ పార్టీలో ఆనువంశిక రాజకీయాలు కనిపించవా?

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాలను ఎప్పుడూ విమర్శించమేనా?
అమిత్ షాను ప్రశ్నించిన శివసేన (యుబిటి) నేత

ఛత్రపతి శంభానగర్ : పరివార్ వాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఇండియా కూటమిని ఆక్షేపిస్తున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తన సొంత పార్టీలో ఆనువంశిక రాజకీయాలను విస్మరించారని శివసేన (యుబిటి) నేత, మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దన్వే ’ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. అమిత్ షా మంగళవారం ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్‌లో ప్రసంగించిన ర్యాలీలో వేదికను గమనించలేదని, ఆనువంశిక రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నేతలు ఆ వేదికపై ఉన్నారని దన్వే తెలిపారు.

మంగళవారం ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా పరివార్ వాదాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని సుదృఢం చేసేవారికి వోటు వేయవలసిందిగా యువతకు అమిత్ షా పిలుపు ఇచ్చారు. ‘కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆనువంశిక రాజకీయాల గురించి ఎంతో మాట్లాడారు. కాని ఆయన తన ర్యాలీ వేదికను గమనించడం మరిచారు.

వేదికపై ఆనువంశిక రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించిన నేతలు కొందరు … శోభ ఫడ్నవీస్, దేవేంద్ర ఫడ్నవీస్, గోపీనాథ్ ముండే, పంకజ ముండే, శంకర్‌రావ్ చవాన్, అశోక్ చవాన్, రావ్‌సాహెబ్ దన్వే, సంతోష్ దన్వే’ అని అంబాదాస్ దన్వే తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. దన్వే కొన్ని బిజెపి మిత్ర పక్షాలను కూడా ఉదహరించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి, నేషనల్ పీపుల్స్ పార్టీ, జనతా దళ్ (సెక్యులర్), ఆర్‌ఎల్‌డి వంటి పార్టీలను దన్వే ప్రస్తావించి, ఆ పార్టీలలో ప్రతి ఒక్కటి ఒక కుటుంబం కేంద్రంగాసాగుతున్నవేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News