Sunday, December 22, 2024

ఢిల్లీ కారు ప్రమాదం మృతురాలు కుటుంబానికి షారుక్ ఫౌండేషన్ సాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ కారు ప్రమాదం ఘటనలో మృతి చెందిన అంజలీ సింగ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు చెందిన చారిటీ సంస్థ ముందుకు వచ్చింది. షారుక్‌కు చెందిన దాతృత్వ సంస్థ మీర్ ఫౌండేషన్ అంజలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసింది. అయితే ఎంత మొత్తం విరాళంగా ఇచ్చిందీ ఆ సంస్థ వెల్లడించలేదు.‘ ఢిల్లీలోని కాంజావాలాలో జరిగిన అత్యంత హేయమైన హిట్‌అండ్ రన్ ఘటనలో 20 ఏళ్ల అంజలి ప్రాణాలు కోల్పోయింది.

తల్లి, నలుగురు తోబుట్టువులున్న కుటుంబానికి ఆమె ఒక్కరే ఆధారం.ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి షారుక్ ఖాన్ మీర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లి చికిత్స కోసం,పిల్లల పోషణ నిమిత్తం మా సంస్థ కొంత మొత్తాన్ని విరాళంగా అందించింది’ అని మీర్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.షారుక్ ఖాన్ తండ్రి మీర్‌తాజ్ మహ్మద్ ఖాన్ పేరుమీదుగా ఈ దాతృత్వ సంస్థ ఏర్పాటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News