Wednesday, January 22, 2025

వైష్ణోదేవి ఆలయంలో షారుఖ్ ఖాన్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తాను నటించిన తాజా చిత్రం పఠాన్ విడుదలకు ముందు వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను సందర్శించి తన చిత్ర విజయం కోసం పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇటీవలే సౌదీ అరబియాలో షూటింగ్ పూర్తయిన సందర్భంగా మక్కాను సందర్శించి ప్రార్థనలు చేసినన షారుఖ్ ఖాన్ తాజాగా సోమవారం జమ్మూ కశ్మీరులో వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు.

భారీ సంఖ్యలో అంగరక్షకుల నడుమ ఆలయాన్ని సందందర్శించిన షారుఖ్ మీడియా కెమెరాల కంటపడకుండా ఉండేందుకు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ షారుఖ్ ఆలయ సందర్శన దృశ్యాలు స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా నుంచి తప్పించుకోలేకపోయాయి. సోషల్ మీడియాలో సైతం ఈ షారుఖ్ వైష్ణోదేవి ఆలయ సందర్శన వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.

ఆదివారం సాయంత్రం కూడా వైష్ణోదేవి ఆలయ పరిసరాలలో షారుఖ్ కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. దీపికా పడుకొణె హీరోయిన్‌గా నటించిన పఠాన్ చితంలో బేషరం రంగ్ అనే పాట విడుదలైన ముందు రోజు షారుఖ్ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్వించడం విశేషం. షారుఖ్ నటిస్తున్న జవాన్, దుంకి చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News