Thursday, December 26, 2024

బాలీవుడ్‌లో షారుక్.. క్రికెట్‌లో కొహ్లీ

- Advertisement -
- Advertisement -

అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల్లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన గత ఆర్థిక సంవత్సరంలో (202324) అత్యధికంగా రూ.92 కోట్ల అడ్వాన్స్ టాక్స్‌ను చెల్లించారు. ఆయన తర్వాతి స్థానంలో తమిళ్ నటుడు ‘తలపతి’ విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. గురువారం ఫార్చూన్ ఇండియా మ్యాగజైన్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, స్పోర్ట్ రంగం నుండి వస్తున్న సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారులలో విరాట్ కొహ్లీ మొదటి స్థానంలో ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో షారుక్ ఖాన్ రూ.92 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. ఇక రెండో స్థానంలో ఉన్న తమిళ నటుడు విజయ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. ఆదాయపు పన్ను చెల్లింపులో క్రీడాకారుల్లో రూ.66 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.38 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.

బాలీవుడ్ సెలబ్రిటీలు
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ప్రముఖ పన్ను చెల్లింపుదారుల జాబితాలో షారుక్ ఖాన్ రూ.92 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. ఆ తర్వాత రూ.80 కోట్ల పన్ను చెల్లింపుతో నటుడు విజయ్ రెండో స్థానంలో, రూ.75 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపుతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ 2023-24లో రూ.71 కోట్లు పన్ను చెల్లించారు. అజయ్ దేవగన్ రూ.42 కోట్లు, రణబీర్ కపూర్ రూ.36 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ రూ.28 కోట్లు, కపిల్ శర్మ రూ.26 కోట్లు, కరీనా కపూర్ రూ.20 కోట్లు, షాహిద్ కపూర్ రూ.14 కోట్లు, కియారా అద్వానీ రూ.12 కోట్లు, కత్రినా కైఫ్ రూ.11 కోట్లు చెల్లించారు. అమీర్ ఖాన్ రూ.11 కోట్లు, మలయాళ సినీ నటుడు మోహన్ లాల్ రూ.14 కోట్లు, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ రూ.14 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News