Thursday, January 23, 2025

చంపేస్తామని షారూఖ్ ఖాన్‌కు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట వరుసగా బెదిరింపులు వస్తుండగా, ఇప్పుడు మరో అగ్రనటుడు షారూఖ్‌ఖాన్‌కు రూ. 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై లోని బాంద్రా పోలీస్‌లు సైబర్ పోలీస్ స్టేషన్ సహకారంతో దర్యాప్తు చేపట్టి ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్టు గుర్తించారు. ఆ ఫోన్ రిజిస్టర్ నెంబర్ ఆధారంగా రాయ్‌పూర్‌కు చెందిన న్యాయవాది ఫైజాన్‌కు సమన్లు జారీ చేశారు. కేసు దర్యాప్తు కోసం పోలీస్ బృందాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. అయితే ఈ బెదిరింపు కాల్ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిందని నిర్ధారణ కాలేదు. ముంబై పోలీస్‌లు రాయ్‌పూర్ వెళ్లి న్యాయవాది ఫైజాన్‌కు సమన్లు జారీ చేశారు. ఫైజాన్‌ఖాన్ పండరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారని రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ సింగ్ వెల్లడించారు.

అంతకు ముందు పోలీస్‌లు ఫైయాజ్‌ఖాన్ అనే వ్యక్తిని గుర్తించారు. బాంద్రాపోలీస్ స్టేషన్‌కు హాజరు కావలసిందిగా ఫైజాన్‌కు సమన్లు జారీ అయ్యాయని సింగ్ తెలిపారు. ముంబై పోలీస్‌లు గురువారం ఉదయం పండరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ కేసు గురించి అక్కడి పోలీస్‌లకు వివరించారు. దాంతో ఫైజాన్‌ను విచారించడానికి స్టేషన్‌కు పిలిపించారని సిటీ ఎస్‌పి అజయ్ కుమార్ పేర్కొన్నారు. గతవారం తన ఫోన్ పోయిందని , ఖామర్ధి పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారని ఫైజాన్ పోలీస్‌లకు వివరించారు. అయితే తదుపరి విచారణకు రావాలని ముంబై పోలీస్‌లు ఫైజాన్‌కు నోటీస్ జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News