Thursday, January 23, 2025

షారుఖ్‌కు వడదెబ్బ.. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిక

- Advertisement -
- Advertisement -

వడదెబ్బ తగలడంతో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ బుధవారం అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. కెడి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో షారుఖ్ ఖాన్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన తన ఆధ్వర్యంలోని కోల్‌కత నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టు ఆడుతున్న ఐపిఎల్ మ్యాచ్ చూసేందుకు షారుఖ్ అహ్మాదాబాద్ వచ్చారు. వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురైన ఆయనను కెడి ఆసుపత్రిలో చేర్చినట్లు అహ్మాదాబాద్ ఎస్‌పి ఓం ప్రకాష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News