ముంబై: త్వరలో ఐపీఓకు వెళ్తున్నటెక్ దిగ్గజం బైజూస్ సంస్థ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కి సంబంధించిన ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరోసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూస్ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎన్‌సిబి ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు ఆ అడ్వర్టైస్‌మెంట్‌లో స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలో ఒక బాధ్యత గల తండ్రిగా పిల్లలకు ఏవిధంగా చదువులో సాయం చేయాలి వంటివి వివరించే ప్రకటనలు కావడం విశేషం. ఒక బాధ్యత గల తండ్రి కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోవడం ఏమిటో అంటూ విమర్శలు తలెత్తిన నేపథ్యంలో బైజూస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికీ కూడా సంస్థ నిరాకరించింది.