Sunday, December 22, 2024

అభిమానితో షారూఖ్ దురుసు ప్రవర్తన.. నెటిజన్ల ఆగ్రహం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఎప్పుడూ కూల్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో అభిమానంగా ఉండే బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌కు తాజా చిత్రం పఠాన్ హిట్‌తో కళ్లు నెత్తికెక్కాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఒక అభిమానితో ఆయన దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనను తాము తమ అభిమాన నటుడి నుంచి ఎన్నడూ ఎదురుచూడలేదని షారుఖ్ అభిమానులు సైతం బాధపడుతున్నారు.

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో షారుఖ్ తళుక్కుమన్నారు. సమీపంలోనే ఉన్న ఒక అభిమాని షారుఖ్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అతని చేతిని పట్టుకుని షారుఖ్ తోసేయడం ఆ అభిమానిని షాక్‌కు గురిచేసింది. నలుపు రుంగు జాకెట్, కూలింగ్ గ్లాసెస్ ధరించి స్టయిలిష్ లుక్స్‌తో దర్శనమిచ్చిన తమ బాలీవుడ్ బాద్షాకు అక్కడ గుమికూడిన అభిమానులు జేజేలు పలికారు.

అయితే, ఏమీ జరగనట్లు కూల్‌గా అభిమానులను సైతం విష్ చేయకుండా షారుఖ్ కారెక్కి వెళ్లిపోయారు. కాగా..షారుఖ్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇలాంటి వారు గతాన్ని మరచిపోతారని, ఈ స్థాయికి తీసుకువచ్చిన ఫ్యాన్స్‌పై ఇలాగేనా ప్రవర్తించేది అంటూ షారుఖ్‌పై ఓ నెటిజన్ మండిపడ్డాడు. పఠాన్ హిట్‌పై ఎన్ని బూటకపు లెక్కలు చెప్పినా కెరీర్ కుంటుపడిన దశలో ఉన్నప్పటికీ షారుఖ్‌లో అహంకారం బాగా తలకెక్కిందంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కెరీర్‌పరంగా చూస్తే షారుఖ్ తదుపరి చిత్రాలు దుంకి, జవాన్ సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ 3లో కూడా అతిథి పాత్రలో షారుఖ్ కనిపించనున్నారు.

Also Read: ‘ది కేరళ స్టోరీ’పై ఎందుకింత రచ్చ?.. సుప్రీంకు చేరిన సినిమా వివాదం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News