Friday, December 20, 2024

తనకు బాధేసిన క్షణాల గురించి చెప్పిన షారూఖ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనకు బాధ కలిగించిన క్షణాల గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్ కూడా. నేటి సాయంత్రం కోల్ కతా జట్టు , హైదరాబాద్ జట్టుతో ఐపిఎల్ ఫైనల్ లో తలపడబోతోంది. చెన్నై చిదంబరం స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది.

తానెదుర్కొన్న బాధకర క్షణాల గురించ షారూఖ్ ఖాన్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. టి20 లీగ్ లో తన కోల్ కతా టీమ్ బాటమ్ లో ఉండిపోవడం బాధ కలిగించిందన్నారు. ఆదిలో తమ టీమ్ కాస్ట్యూమ్ కూడా చర్చనీయాంశం అయిందన్నారు.

ఐపిఎల్ 2024 బ్రాడ్ కాస్టర్ అయిన ‘స్టార్ స్పోర్ట్స్’ చేసిన ఇంటర్వ్యూలో షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ ప్రపంచంలోనే మంచి టీమ్ మాది. కానీ మేము ఓడిపోతూ వచ్చాము’’ అన్నారు.

‘‘ నాకు ఇంకా బాగా గుర్తు, ఆ విచారకరమైన క్షణాలు, ఎవరో నాతో ‘‘మా కాస్ట్యూమ్ మాత్రం చాలా బాగుంది, కానీ గేమ్ ప్లే బాగాలేదు’’ అన్నారు. అది కూడా ఓ ఎక్స్ పర్ట్ మాట్లాడ్డం నాకు బాధ కలిగించింది. కానీ ఇప్పుడు మేము గౌతమ్ గంభీర్ తో తిరిగొచ్చాము.  ఇప్పుడు మా సత్తా చాటుతున్నాము. ఇది మాకు ఎలా ఓడాలో నేర్పింది, కానీ పరాజితుడుగా ఉండమని కాదు, ఎప్పటికీ ఆశ వదులుకోవద్దని నేర్పింది. ఆటలు అదే నేర్పుతుంటాయి’’ అంటూ ఆయన చెప్పకొచ్చారు.

ఐపిఎల్ క్వాలిఫయర్ 1 లో కెకెఆర్ టీమ్, ఎస్ ఆర్ హెచ్ టీమ్ ను ఓడించింది. అయితే హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించి తిరిగి ఫైనల్ లోకి ప్రవేశించింది. నేటి మ్యాచ్ టైటిల్-డిసైడర్ ని చేయనున్నది.

కోల్ కతా జట్టు ఫేవరేట్ గా ఉంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వారిని నిలువరించగలదా అన్నది చూడాలి. హైదరాబాద్ జట్టు ఓడితే ఓనర్ కావ్య మారన్ కే కాదు, హైదరాబాద్ జట్టు అభిమానులను కూడా నిరాశపరచగలదు. చేతికొచ్చింది నోటికందకుండా ఏ టీమ్ కు అవుతుందో చూడాలి మరి.  స్పిన్నర్ లు తమ నైపుణ్యం చాటుతారా అన్నది తేలాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News