Wednesday, January 22, 2025

నవభారత్ కోసం కొత్త పార్లమెంట్ : షారూఖ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ముంబై : కొత్త పార్లమెంట్‌భవనం “నవ భారత్ దిశ ”గా ముందుకు తీసుకువెళ్తుందని, దేశ ప్రగతి చరిత్రకు చిహ్నం కాగలదని బాలీవుడ్ సెలబ్రిటీలు షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ నమ్మకాన్ని వెలిబుచ్చారు. వీరు తమ వాయిస్ ఓవర్‌తో నూతన పార్లమెంట్ భవనం వీడియోను షేర్ చేశారు. నూతన పార్లమెంట్ భవనం మన ఆశల నూతన గృహమని షారూఖ్ తన ట్వీట్‌లో వాయిస్ ఓవర్‌లో తెలిపారు. ప్రధాని నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని శనివారం రాత్రి పంపిన ఈ వీడియోసందేశాల్లో వెలిబుచ్చారు.

ఈ ఇద్దరు నటులు తమ వీడియో సందేశాలను పంపడంపై ప్రధాని మోడీ ప్రశంసించారు. నూతన పార్లమెంట్ భవనం మన ఆశల నూతన గృహమని, మన రాజ్యాంగాన్ని బలపరిచే వారి నివాసమని షారూఖ్ తెలిపారు. ఈ గొప్పతనం దేశం లోని ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. భారత దేశ వైవిధ్యాన్ని పరిరక్షిస్తుందని చెప్పారు. దీనికి స్వదేశీ చిత్రం లోని బ్యాక్‌గ్రౌండ్ ఏ జో దేశ్ హై తెరా పాట స్కోరును జత చేశారు. అక్షయ్‌కుమార్ ఇచ్చిన ట్వీట్‌లో పార్లమెంట్ భవనాన్ని చూడటం గర్వకారణమన్నారు.

భారత్ దేశాభివృద్దికి విశిష్ట చిహ్నంగా ఇది ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మై పార్లమెంట్… మై ప్రైడ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. అక్షయ్ కుమార్ ట్వీట్‌ను ప్రధాని మోడీ రీ ట్వీట్ చేస్తూ ఆలోచనలను బాగా వెల్లడించారని ప్రశంసించారు. మన నూతన పార్లమెంట్ భవనం మన ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి అని ,ఇది మన దేశ సుసంపన్న వారసత్వాన్ని, భవిష్యత్తు కోసం బలమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ప్రధాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News