Wednesday, January 22, 2025

రజనీకాంత్ కు కింగ్ ఖాన్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ కు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగీ డాన్స్ పాటలోని తన ఫోటోను షేర్ చేస్తూ, ‘అనితరసాధ్యమైన మహానటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూ, ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి’ అంటూ షారుఖ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
షారుఖ్ నటించిన డంకీ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటించిన డంకీ ఈనెల 21న విడుదల కాబోతోంది. పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తో జోరు మీదున్న షారుఖ్, ‌డంకీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News