Tuesday, January 14, 2025

షారుఖ్ ‘జవాన్’ ట్రైలర్.. అద్భుత విజువల్స్ తో గూస్బంప్స్..

- Advertisement -
- Advertisement -

‘పఠాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి జోష్ లోకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారఖ్ ఖాన్ వరుస సినిమాలతో అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు.  పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లతో గూస్బంప్స్ వచ్చేలా ట్రైలర్ వదిలారు. భారీ యాక్షన్ సీన్స్ విజ్వువల్స్ తో ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇందులో నయనతార రా ఆఫీసర్ నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీపికా పడుకొనే కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ మూవీపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న భారీ స్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News