Sunday, December 22, 2024

ఆస్కార్ అవార్డు వస్తే దాన్ని తాకే అవకాశం ఇవ్వండి: షారూఖ్ ఖాన్

- Advertisement -
- Advertisement -
నటుడు రామ్‌చరణ్‌ను ఉద్దేశించి ట్వీట్

ముంబై: బాలీవుడ్ స్టార్ ‘పఠాన్’ ట్రయిలర్ నేడు విడుదల అయింది. నలుమూలల నుంచి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది సెలబ్రిటీలు ఆ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా షారూఖ్ ఖాన్ సినిమా విజయవంతం కావాలని విష్ చేశారు. దానికి షారూఖ్ ఖాన్ ట్వీట్ ద్వారా సముచితంగా జవాబిచ్చారు. అది ఇప్పుడు వైరల్ అయింది. ‘మెగా పవర్ స్టార్ మీకు కృతజ్ఞతలు. మీ ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ భారత్‌కు ఆస్కార్‌ను తీసుకొస్తే దానిని నన్నూ తాకనివ్వండి!’ అని ట్వీట్ చేశాడు.

‘పఠాన్’ సినిమా ట్రైలర్‌ను ఒక్కో భాషల్లో ఒక్కో హీరో విడుదల చేశారు. తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. ఇది యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తమిళంలో ట్రైయిలర్‌ను విడుదల చేసిన విజయ్‌కు కూడా ఆయన థ్యాంక్స్ తెలిపారు. ‘పఠాన్’ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News