ముంబయి: మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్‌సిబి) శనివారం రాత్రి ముంబయి తీరంలో కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌకపై దాడిచేసి రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుంది. వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్(23) కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ శాఖ ధృవీకరించింది.
ఎన్‌సిబి మొత్తం ఎనిమిది మందిని పట్టుకుని ప్రశ్నిస్తోంది. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆ ఎనిమిది మంది పేర్లు: మూన్‌మూన్ ధమేచ, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్డా, ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్.
ఎన్‌సిబి అధికారుల బృందం ప్యాసింజర్ల మాదిరిగా ఆ నౌకలోకి ప్రవేశించి వారిని పట్టుకున్నారని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఆ నౌకలో ఎస్కాటసీ, కొకైన్, ఎండి(మెఫెడ్రోన్), చరాస్ వంటివి సాధీనం చేసుకున్నట్లు మాదకద్రవ్యాల నిరోధక శాఖ తెలిపింది.
मुंबई क्रूज केस: सभी 8 आरोपी गिरफ़्तार #ATVideo @pankajcreates pic.twitter.com/kmojZ2vAYU
— AajTak (@aajtak) October 3, 2021