Sunday, December 22, 2024

కూతురితో షారుఖ్ సినిమా వాయిదా!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్, డంకీ సినిమాలతో హ్యాట్రిక్ సాధించి, బాలీవుడ్ లో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఇకపై తన వారసులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా కూతురు సుహానా ఖాన్ ను  హీరోయిన్ గా నిలబెట్టేందుకు నడుం బిగించాడు. జోయా అఖ్తర్ డైరెక్షన్ లో సహానా ఖాన్ ప్రధాన పాత్రలో ది ఆర్చీస్ అనే మూవీ వచ్చినా, అది సుహానా కెరీర్ కు ప్లస్ కాలేదు.

దాంతో తన సినిమాలోనే కూతుర్ని నటింపజేసి, ఆమె కెరీర్ ను ట్రాక్ పైకి ఎక్కించాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ కథను సిద్ధం చేసి, సుజయ్ ఘోష్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు కూడా. ఇందులో షారూఖ్ ది కాబూలీవాలా వేషం. అనాథగా అష్టకష్టాలు పడుతున్న ఓ బాలిక (సుహానా ఖాన్)ను ఆదుకునే వేషం అది. అయితే అకస్మాత్తుగా ఈ సినిమా నిర్మాణం నిరవధికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. షారూఖ్ ని కాబూలీవాలా వేషంలో చూసేందుకు అభిమానులు ఇష్టపడరని, అందువల్ల సినిమా ఫ్లాప్ అయితే సుహానా ఖాన్ కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుందని కొందరు సలహా ఇవ్వడమే మూవీ వాయిదా పడటానికి కారణమని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News