Friday, November 22, 2024

రేవ్ పార్టీలో షారూఖ్ కొడుకు

- Advertisement -
- Advertisement -

Rajkumar arrested in Telugu akademy case

ఆర్యన్‌ఖాన్ సహా అరెస్టు అయిన 8 మందిలో ఇద్దరు మహిళలు

ముంబై టు గోవా నౌకలో రేవ్ పార్టీ
పార్టీలో అమిత నిషా ఇచ్చే మాదక ద్రవ్యాలు
కొకైన్, చరస్, ఎండిఎంఎ తదితరాలు
అద్దె క్రూయిజ్‌లో జల్సాలు
ముందుగా అందిన సమాచారంపై మాదక ద్రవ్యాల సంస్థ బృందం దాడి

ముంబై : ముంబై తీర జలాల్లో నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సిబి) అధికారులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఇందులో పాల్గొన్న వారిలో బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ నౌక ముంబై నుంచి గోవాకు బయల్దేరిన సమయంలో ఎన్‌సిబి బృందం దాడి జరిగింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్యన్ ఖాన్ కాక ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. ఇక్కడి అరేబియా సముద్రం తీరం దాటి సంగీతపు హోరులో కొంతదూరం వచ్చిన తరువాత కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌకలో శనివారం సాయంత్రం వేళ భారీ స్థాయిలో డ్రగ్స్‌తో పార్టీ జరుగుతున్నట్లు ఫక్కా సమాచారం అందడంతో ఎన్‌సిబి బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నౌక ముంబై నుంచి గోవాకు బయలుదేరిన దశలో ఎన్‌సిబి టిఎం దాడి జరిపింది. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న వారిలో షారూఖ్ కుమారుడు కూడా ఉన్నట్లు నిర్థారణ అయింది.

రేవ్ పార్టీలో పలువురిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఎన్‌సిబి అధికారులు ఆదివారం తెలిపారు. పట్టుకున్న వారిలో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధమేచా, నుపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకెర్, గొమిత్ చోప్రా, అర్బాజ్ మర్చెంట్‌లు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ చెకింగ్ దళంలోని వారు సాధారణ ప్రయాణికుల మాదిరిగా మఫ్టీలోనౌకలో చేరి, రేవ్ పార్టీ జరుగుతున్న దశలో అదును చూసుకుని మత్తుమందు సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడైంది. స్వాధీనపర్చుకున్న డ్రగ్స్‌లలో కొకైన్, చరస్, ఎండిఎంఎ, ఎక్సటసీ, మెఫ్రేడ్రోన్( (ఎండి) వంటి అత్యధిక మోతాదు నిషాకారక మత్తుమందులు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌పార్టీకి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

ముందుగా అందిన వేగు సమాచారంతోనే

సముద్రంలో ఓ నౌకలో డ్రగ్స్‌పార్టీకి రంగం సిద్ధం అయిందని శనివారం మధ్యాహ్నం ఎన్‌సిబికి సమాచారం అందింది. దీనితో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేతో కూడిన ఎన్‌సిబి బృందం క్రూయిజ్ నౌకలో చేరి దాడికి దిగడం, ఇందులో సూపర్‌స్టార్ కుమారుడు కూడా ఉండటం, ఇప్పటికే డ్రగ్స్ సంబంధిత కేసులతో కలకలంతో ఉన్న బాలీవుడ్‌లో తుపాన్ చెలరేగింది. డ్రగ్స్ తీసుకుంటున్న యువ బృందాన్ని అక్కడికక్కడ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగా, ఇతర ప్రయాణికుల వద్ద కూడా డ్రగ్స్ దొరికినట్లు అధికారులు నిర్థారించారు. ఆదివారం తెల్లవారుజామున పట్టుబడ్డ వారిని ఎన్‌సిబి కార్యాలయంలో విచారించే కార్యక్రమం చేపట్టారు.

మాకేమీ సంబంధం లేదుః వాటర్‌వేస్ కంపెనీ

డ్రగ్స్‌కు రేవ్‌పార్టీకి తమకు ఎటువంటి సంబంధం లేదని ఈ నౌక కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమకు ఎటువంటి ప్రమేయం లేదని సంబంధితనౌక నిర్వహక సంస్థ అయిన వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి, సంస్థ ప్రెసిడెంట్ జర్గెన్ బైలమ్ ఓ ప్రకటన వెలువరించారు. ఈ నౌకను ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం అని చెపితే ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి అద్దెకు ఇచ్చినట్లు జర్గెన్ వివరణ ఇచ్చారు. తమ సంస్థ ఎప్పుడూ కుటుంబపక్షంగా పూర్తిస్థాయి వినోదం ఆహ్లాదంతో కూడిన పర్యాటకాన్ని కల్పిస్తూ వస్తోందని వివరించారు. ఇప్పుడు జరిగినట్లుగా చెపుతున్న ఘటన తమ క్రూయిజ్‌ల సంస్కృతి , పర్యాటక లక్షాలకు విరుద్ధంగా ఉందని, దీనితో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలను తాము ఖండిస్తున్నామని , ఇక ముందు ఈ విధమైన కార్యకలాపాలకు తమ నౌకా ప్రయాణాలను వాడుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి ఘటనకు సంబంధించి తాము సంస్థాపరంగా చట్టపరిరక్షక సంస్థలు, అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు.

షారూఖ్ పెద్ద కొడుకు తైక్వాండో దిట్ట

షారూఖ్ గౌరీ ఖాన్‌ల పెద్ద కుమారుడు అయిన ఆర్యన్‌ఖాన్‌కు 23 సంవత్సరాలు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. లండన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తరువాత అమెరికాలో సినిమాటిక్ ఆర్ట్ , సినిమా నిర్మాణ సంబంధిత డిగ్రీ పొందాడు. తైక్వాండో బ్లాక్‌బెల్ట్ అయిన ఆర్యన్ తండ్రి సినిమాలలో ఒకటి రెండింటిలో చిన్నప్రాయపు షారూఖ్‌గా కొద్ది సేపు కన్పించిన ఘట్టాలు ఉన్నాయి. చాలాకాలంగా ఆర్యన్‌నుషారూఖ్ మీడియాకు దూరంగా ఉంచుతూ పెంచారు. అయితే భారీ స్థాయిలో హీరోగా పరిచయం చేయాలని, తన నటవారసత్వాన్ని వ్యాపారరీత్యా కొనసాగేలా చేసుకోవాలని వ్యూహం ఖరారు చేసుకున్నారు. ఈ దశలో రేవ్ పార్టీలో మత్తుకేసులో ఆర్యన్ చిక్కారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News