కరాచీ: ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్‌లో టీమిండియాను దాయాదీ జట్టు పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఓటమెరుగని జట్టుగా కొనసాగిన భారత జట్టుకు బాబర్ ఆజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది తనకు ఫోన్ చేశాడని పాక్ మాజీ సారధి షాహిద్ అఫ్రిది తెలిపాడు. ఈ కీలక మ్యాచ్‌కు ముందు షాహీన్ అఫ్రిది తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, దాంతో తనకు ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘టీమిండియాతో షాహిన్ తన తొలి గేమ్ ఆడకముందు నాకు వీడియోకాల్ చేసి ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు. మేం సుమారు 12 నిమిషాలు మాట్లాడుకున్నాం. దాంతో.. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వు. టీమిండియా వికెట్లు తీసి హీరో అవ్వు’ అని అతడికి సూచించానని అఫ్రిది పేర్కొన్నాడు.
Shaheen called me before match against India: Afridi