- Advertisement -
ఓ కేసులో పేరు తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఇన్స్‌స్పెక్టర్ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా శుక్రవారం పట్టుబడ్డాడు. షాహినాయత్ గంజ్ ఇన్స్‌స్పెక్టర్‌గా గతంలో బాలు చౌహాన్ పనిచేశాడు. ఆ సమయంలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇందులో ఓ వ్యక్తిని నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు రూ.1,50,000 డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బాధితుడిని వేధింపులకు గురిచేశాడు, ఈ క్రమంలోనే రూ.50,000 ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు ఇన్స్‌స్పెక్టర్‌కు డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
- Advertisement -