Monday, January 20, 2025

షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఇడి కూడా అరెస్టు చేయవచ్చు: కలకత్తా హైకోర్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: సందేశ్‌ఖలిలో మహిళలపై లైంగిక అత్యాచారాలు, భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లేదా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేయవచ్చునని కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది.

రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ అభ్యర్థనపై కోర్టు ఈ నెల 26 నాటి తన ఉత్తర్వుపై వివరణ ఇచ్చింది. షాజహాన్ షేఖ్‌ను పోలీస్ అధికారులు అరెస్టు చేయాలని 26న కోర్టు ఆదేశించింది. ఇడి అధికారులపై దాడిపై దర్యాప్తు చేయడానికి సిబిఐ, పశ్చిమ బెంగాల్ పోలీసులతో సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఒకరే న్యాయమూర్తి ఉన్న బెంచ్ ఏర్పాటు చేయడాన్ని మాత్రమే ఈ నెల 7 నాటి తన ఉత్తర్వులో కోర్టు నిలుపుదల చేసిందని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ వివరించింది.

పరారీలో ఉన్న షేఖ్‌ను ‘అరెస్టు చేసేందుకు సిబిఐ లేదా ఇడికి కూడా అవకాశం ఉంది’ అని డివిజన్ బెంచ్ ఆదేశించింది. షేఖ్ చాలా కాలంగా పరారీలో ఉన్నట్లు బెంచ్ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తు నిమిత్తం షేఖ్ ప్రాంగణం సోదా కోసం ఇడి అధికారుల బృందం జనవరి 5న ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలికి వెళ్లినప్పుడు సుమారు వెయ్యి మంది సభ్యుల గుంపు వారిపై దాడి జరిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News