Thursday, January 23, 2025

7 రోజుల్లో షాజహాన్ అరెస్టు: టిఎంసి

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకుడు షాజహాన్ షేక్‌ను ఏడు రోజుల్లోగా అరెస్టు చేస్తామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి) సీనియర్ నాయకుడు కునాల్ హోష్ సోమవారం ప్రకటించారు. షాజహాన్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత కునాల్ ఘోష్ నుంచి వెంటనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

షాజహాన్ అరెస్టుపై పార్టీ ఎంపి అభిషేక్ బెనర్జీ చెప్పిందే సరైనదని ఘోష్ తెలిపారు. ఈ అంశం కోర్టు పరిధిలో చిక్కుకుని ఉందని, దీన్ని అవకాశంగా తీసుకుని బిజెపి రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. నేడు హైకోర్టు ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చి షాజహాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. వారం రోజుల్లోగా షాజహాన్‌ను అరెస్టు చేస్తామని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న షాజహాన్ షేక్, ఆయన మద్దతుదారులపై మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాల ఆరోపణలు వెల్లువెత్తాయి. జనవరి 5న ఇడి అధికారులపై మూకల దాడి అనంతరం షాజహాన్ పరారయ్యాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News