Thursday, January 23, 2025

ఆటోను ఢీకొట్టిన లారీ: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు యువకులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ రాంగ్ రూట్‌లో రావడంతో పాటు పొగమంచు ఎక్కువగా ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. భక్తులు గంగా నదిలో స్నానాలు చేయడానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. లారీ అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. లారీ కిందకు ఆటో వెళ్లడంతో నుజ్జునుజ్జుగా మారింది. ఆటో నుంచి లారీని వేరు చేయడానికి డ్రైవర్ ముందుకు వెనకకు కదిలించడంతో ఆటోలో మృతదేహాలు నుజ్జునుజ్జుగా మారాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News