Monday, December 23, 2024

‘జవాన్’ ఛాలెంజింగ్‌గా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ పఠాన్ చిత్రంతో ఈ ఏడాది పాన్ ఇండియా రేజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సూపర్ స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రతి నెల #AskSRK అనే పేరుతో తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి #AskSRK సెషన్‌లో పాల్గొని అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ “ప్రస్తుతం నేను డంకీ, జవాన్ సినిమాలు చేస్తున్నాను. వీటిలో జవాన్ సినిమా ఛాలెంజింగ్‌గా అనిపించింది. కారణమేమిటంటే… ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే. జవాన్ చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News