Monday, December 23, 2024

సహ నటుడిపై ప్రశంసలు కురిపించిన షారుఖ్

- Advertisement -
- Advertisement -

మరో మూడు రోజుల్లో కింగ్ ఖాన్ నటించిన డంకీ రిలీజవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టి, జోరు మీదున్న షారుఖ్… మరో హిట్ తో హ్యాట్రిక్ సాధించాలన్న కసితో ఉన్నాడు. పైగా హిట్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ రూపుదిద్దుకోవడంతో అభిమానుల్లోనూ దీనిపై ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి.

డంకీ సినిమా ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో షారుఖ్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. షారుఖ్ డంకీ గురించి మాట్లాడుతూ అందులో నటించిన విక్కీ కౌశల్ పై ప్రశంసలు కురిపించాడు. ‘విక్కీ నాకు మంచి స్నేహితుడు. నేను ఇప్పటివరకూ నటించిన చక్కటి నటుల్లో అతను ఒకడు. డంకీలో విక్కీ కౌశల్ ను చూస్తే, మీకు అతనిపై ప్రేమ మరింత పెరుగుతుంది. చాలా బాగా నటించాడు’ అంటూ పొగడ్తలు కురిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News