Monday, December 23, 2024

‘పఠాన్’లో దీపికా దుస్తులపై తీవ్ర విమర్శలు.. స్పందించిన షారుక్ ఖాన్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: తన తాజా చిత్రం ‘పఠాన్’లో వస్తున్న విమర్శలపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. గురువారం ఇక్కడ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తనలాంటి వారు చుట్టూ ఏమి జరిగినప్పటికీ పాజిటివ్‌గానే ఉంటామని అన్నారు. ‘హమారే జైసా పాజిటివ్ లోగ్ జిందా హై’ అని షారుక్ ఖాన్ అన్నారు. షారుక్ దీపికా పడుకొణె నటిస్తున్న పఠాన్ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక ధరించిన కాస్టూమ్స్‌పై విమర్శలు వెల్లవెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ పాటలో అశ్లీలం హద్దులు మీరిందంటూ, సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశంలోని పలు నగరాల్లో ఆందోళనలు జరిగాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆందోళనకారులు షారుక్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో షారుక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా సినిమా ప్రేమ, ఐక్యత, సోదరభావానికి ఉన్న గొప్ప సామర్థాన్ని మానవాళి ముందుకు తీసుకు వస్తుందని తన ప్రసంగంలో షారుక్ అన్నారు. మనవాళిపై చేసే వ్యతిరేక వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి సినిమానే తగిన చోటని కూడా ఆయన అన్నారు. వేర్వేరు వర్ణాలు, కులాలు, మతాలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి సినిమా ఒక మార్గం అని కూడా షారుక్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News