Sunday, December 22, 2024

హైదరబాదీ అభిమానులకు షారుఖ్ ఖాన్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ హైదరాబాదీ అభిమానులకు ట్వీట్ చేశాడు. దీంతో షారుఖ్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. షారుఖ్ నటించిన డంకీ గురువారం రిలీజైంది. ఈ ఏడాది ఇప్పటికే జవాన్, పఠాన్ వరుస హిట్లతో జోరు మీదున్న షారుఖ్.. డంకీతో హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. పైగా హిట్ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందడంతో డంకీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

డంకీ విడుదల నేపథ్యంలో షారుఖ్ హైదరాబాదీ అభిమానులను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. డంకీ ప్రీమియర్ షోను హైదరాబాద్ లోని దేవీ థియేటర్లో ఉదయం 8 గంటలకు ప్రదర్శించారు. ఈ షోకి టికెట్లు బుక్ చేసుకున్న హైదరాబాద్ ఫ్యాన్స్ క్లబ్స్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా షారుఖ్ ‘వావ్ హైదరాబాద్! ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేయండి. మూవీపై మీరేం చెబుతారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా’ అని  ట్వీట్ చేశాడు.

Shahrukh Khan tweet to Hyderabadi fans

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News