Monday, January 20, 2025

ఉమెన్ చాందీని కలిసిన ఎపిసిసి అధ్యక్షుడు శైలజానాథ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కలిశారు.  త్రివేండ్రమ్ లో ఉమెన్ చాందీ నివాసానికి శైలజానాథ్ వెళ్లారు. ఉమెన్ చాందీ సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేశారు.  ఉమెన్ చాందీకి సాకే శైలజనాధ్ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. విభజన అనంతరం ఎపిలో నెలకొన్న తాజా రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అక్టోబర్ 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కోసం ఎపిలో చేసిన ఏర్పాట్లను ఉమెన్ చాందీకి వివరించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణపై ఉమెన్ చాందీ తో ఆయన చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News