Thursday, January 23, 2025

శాకాంబరీ దేవి అలంకారంలో ఏడుపాయల వనదుర్గాభవాని మాత

- Advertisement -
- Advertisement -
  • భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
  • ఈఓ సార శ్రీనివాస్

పాపన్నపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాత అమ్మవారు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆషాడమాసం రెండో ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం వేకువజామున నుంచే భక్తులు అమ్మవారికి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రావికోటి శంకర్‌శర్మ అమ్మవారికి అభిషేకంప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వనదుర్గాభవాని మాతను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరీదేవిగా వనదుర్గభవాని మాత అమ్మవారిని అలంకరించారు. భక్తులకు దర్శనం కల్పించారు. మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు, ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ఈవో సార శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించారు. ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ భక్తులకు సేవలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News