Sunday, December 22, 2024

పతుల కోసం.. సతుల ప్రచారం

- Advertisement -
- Advertisement -

బోధన్: పతుల గెలుపు కోసం సతుల ఎన్నికల ప్రచారం తీవ్రతరమైంది. అసెంబ్లీ ఎన్నికల బడిలో భర్తలు నిలిచి ఉండడంతో భార్యలు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా పాల్గొంటున్నారు. పతుల గెలుపే లక్షంగా సతుల ఎన్నికల ప్రచారం అందరిని ఆకట్టుకుంటుంది. బోధన్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల బరిలో బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల బరిలో ఉండగా ఆయన సతీమణి అయేషా ఫాతిమా ప్రచారంలో దూసుకుపోతున్నారు. షకీల్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళా ఓటర్లను ఆ కట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే అయేషా ఫాతిమా చారిటబుల్ ట్రస్టు ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ చేపట్టి అందరికి సుపరిచితురాలుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భర్త గెలుపు కోసం ఆమె ప్రచారంలో కీలకంగా పాల్గొంటున్నారు. బిజెపి అభ్యర్థి వడ్డీ మోహన్‌రెడ్డి తరపున ఆయన సతీమణి వడ్డీ లక్ష్మి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. నియోజక వర్గంలోని వివిధ మండలాలలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. బిజెపి అభ్యర్థి మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. పతుల కోసం సతుల ఎన్నికల ప్రచారం చేపడుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News