Monday, January 20, 2025

మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు రాహిల్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

కస్టడీ పిటిషన్ కొట్టివేత..షరతులతో కూడిన బెయిల్ మంజూరు –

హైదరాబాద్ : నగరంలోని ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో ఇటీవల అరెస్టై, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉంటున్న బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు రాహిల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. బెయిల్ కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు ఈ నెల 8న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అతడికి సూచించింది.

అదే సమయంలో రాహిల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల కస్టడీని కోర్టు కొట్టివేసింది. గతేడాది డిసెంబర్‌లో ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఎ౧ నిందితుడిగా ఉన్న రాహిల్‌ను ఈ నెల 8న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన అతడు, సోమవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రాగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అయితే రాహిల్‌ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సాహిల్ సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం కస్టడీ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News