Monday, December 23, 2024

ఐపిఎల్‌కు షకిబ్ దూరం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపిఎల్ సీజన్16కు దూరమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కు షకిబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే రానున్న ప్రపంచకప్‌తో పాటు ఇతర సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని ఐపిఎల్ మొత్తానికి దూరం కావాలని షకిబ్ నిర్ణయించాడు. మినీ వేలం పాటలో కోల్‌కతా రూ.1.50 కోట్లను వెచ్చించి షకిబ్‌ను సొంతం చేసుకుంది.

బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎంతో మెరుగైన ఆటగాడిగా పేరున్న షకిబ్ ఐపిఎల్‌కు దూరం కావడం కోల్‌కతా టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమకాలిన ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో షకిబ్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేగాక సుదీర్ఘ కాలం పాటు షకిబ్ కోల్‌కతా ప్రాతినిథ్యం వహించాడు. ఇలాంటి ఆటగాడి సేవలు అందుబాటులో లేక పోవడం జట్టు యాజమాన్యానికి షాక్‌కు గురి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News