పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ గెలుపొందాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన 12వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి షేక్ హసీన్ నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి షకిబ్ అల్ హసన్ విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో షకిబ్‌కు 1,85,388 ఓట్లు పడగా.. సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కు 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 1,39,395 ఓట్ల తేడాతో షకిబ్ భారీ విజయం సాధించాడు. ఇక, అవామీ లీగ్ పార్టీ.. ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాల్ని గెలుచుకుని మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
కాగా, షకిబ్ అల్ హసన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఎన్నికల్లో గెలవడంతో షకిబ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ, మంత్రిగా అవకాశం వస్తే.. క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఇటీవల ఇండియాలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టుకు షకిబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.