Sunday, January 19, 2025

షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు: బిసిబి సంచలన కామెంట్స్

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బిసిబి) చీఫ్ ఫరూఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆందోళన కారులు సృష్టించిన విధ్వంసం గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితుల్లో షకీబ్ భద్రత మా చేతుల్లో లేదని ఫరూఖి అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, షకీబ్.. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.

ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆడుతున్నాడు షకీబ్. రెండో టెస్టు కోసం ఇప్పటికే కాన్పూర్ కు వెళ్ళింది బంగ్లాదేశ్ టీమ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షకీబ్.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు మ్యాచ్ తనకు చివరిది కావచ్చని.. అలా కుదరకపోతే, కాన్పూర్ టెస్టే తనకు చివరి టెస్టు మ్యాచ్ అని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని బిసిబికి తెలిపానని.. అందుకు బోర్డు అంగీకరించిందని తెలిపారు. అయితే, బంగ్లాదేశ్ లో తన భద్రతపై కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

ఇటీవల జరిగిన సంఘటనతో దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన షేక్ హసీనా పార్టీ నుంచి షకీబ్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే.. ఈ గొడవల్లో జరిగిన ఓ మర్డర్ ఘటనలో షకీబ్ పై కేసు నమోదు అయ్యింది. బంగ్లాలో ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి షకీబ్ స్వేదేశానికి వెళ్లలేదు. ఇప్పుడు వెళితే పరిస్థితి ఏంటనే విషయంలో అతను ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అయితే..స్వదేశంలో తన చివరి టెస్టు మ్యాచ్ అనంతరం ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిపోతానని.. మళ్లీ ఎప్పటికీ బంగ్లాదేశ్ తిరిగిరానని ప్రస్తుత ప్రభుత్వానికి షకీబ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News