Sunday, January 19, 2025

బోధన్‌లో షకీల్ నామినేషన్‌.. బైక్‌పై వచ్చిన కవిత

- Advertisement -
- Advertisement -

బోధన్ : బోధన్ బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్కూటీపై వచ్చారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ ర్యాలీ ఏర్పాటు చేయడంతో ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ నుంచి ర్యాలీలో స్కూటీపై ఆమె పాల్గొన్నారు. విక్టరీ సంకేతాన్ని చూపుతూ బోధన్, అచంపల్లి వరకు స్కూటీపై వచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ కార్యక్రమానికి స్కూటీపై రావడం బిఆర్‌ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఆమెను అనుసరిస్తూ ముందుకు సాగారు. షకీల్ నామినేషన్ కార్యక్రమంలో కవిత స్కూటీ పై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News