Wednesday, January 22, 2025

టి టిడిపి అధ్యక్షుడు కాసానికి రాఖీ కట్టిన భవనం షకీలా రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో..ఆ పార్టీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి వారి బృందం రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాఖీ పండగ పురస్కరించుకొని టిడిపి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యకమానికి సంబంధించి పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉందని, నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల వైపు ఉంటామనే భరోసాను పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు బరోసా ఇవ్వాలని సూచించారు.ధర్నా కార్యక్రమంపై శుక్రవారం పార్టీ శ్రేణులకు స్పష్టత ఇస్తామని అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News