Thursday, December 26, 2024

యాక్షన్, కామెడీతో పాటు సందేశం

- Advertisement -
- Advertisement -

Shakini Dakini Movie Press Meet

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ’మిడ్‌నైట్ రన్నర్స్’కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ’శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమవుతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ’శాకిని డాకిని’ ఈనెల 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో రెజీనా కసాండ్రా మాట్లాడుతూ “ఈ సినిమాలో యాక్షన్, కామెడీతో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. కథానాయకులుగా ఇద్దరు హీరోయిన్స్ వుండటం ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది” అని అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ “ఇందులో నేను, రెజీనా చాలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్స్ అది. టీజర్, థీమ్ సాంగ్‌లో మా కెమిస్ట్రీకి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమాలో అది ఇంకా బావుంటుంది” అని తెలిపారు. సునీత తాటి మాట్లాడుతూ “ఈ సినిమాలో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్‌ని ఎలా డీల్ చేస్తారనేది కథ. సినిమాలో నివేదా పంచ్‌లు, రెజీనా కిక్కులు నెక్స్ లెవెల్‌లో వుంటాయి”అని చెప్పారు.

Shakini Dakini Movie Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News